calender_icon.png 31 January, 2026 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లెమింగ్ ల్యాబొరేటరీస్ (సీఎస్ఆర్) స్టడీ బెంచీలు పంపిణీ

31-01-2026 09:01:08 PM

మేనేజింగ్ డైరెక్టర్ జె.ఎం. ప్రకాష్

శివంపేట్: మెదక్ జిల్లా శివాంపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్లెమింగ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల విద్యా అవసరాల కోసం స్టడీ బెంచీలను పంపిణీ చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జె.ఎం. ప్రకాష్ మాట్లాడుతూ, విద్యే సమాజాభివృద్ధికి పునాదని, గ్రామీణ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యకు నిరంతరం మద్దతు అందిస్తామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్  డా.ఎస్వి సైలజ సంస్థ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు.