calender_icon.png 1 February, 2026 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి అక్రమ సాగు, రవాణాపై కఠిన చర్యలు

31-01-2026 08:53:07 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలో గంజాయి అక్రమ సాగు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాదకద్రవ్యాల నివారణపై అధికారులకు పలు సూచనలు చేశారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.