31-01-2026 08:56:23 PM
పిఎస్ లో ఫిర్యాదు చేసిన తల్లి
జవహర్ నగర్,(విజయక్రాంతి): గోల్డ్ స్మిత్ అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం... బాలాజీ నగర్ వికలాంగుల కాలనీకి చెందిన బూరుగు సత్యనారాయణ( 28) వికలాంగుల కాలనీలో సోదరుడు, తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి బాలాజీ నగర్ లో గోల్డ్ వర్క్ షాప్ లో గోల్డ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈనెల 26వ తేదీన ఉదయం 9 గంటలకు గోల్డ్ షాపుకు వెళ్లిన సత్యనారాయణ మరల తిరిగి ఇంటికి రాలేదు. గతంలో సత్యనారాయణ ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి మరల రెండు మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చేవాడు. కానీ ఈసారి వెళ్లిన సత్యనారాయణ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికిన బంధువుల వద్ద వెతికిన తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. ఈ మేరకు తల్లి సంజీవమ్మ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.