calender_icon.png 31 January, 2026 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలి

31-01-2026 08:50:01 PM

ఎంపీడీవో విజయ్‌కుమార్‌

చిగురుమామిడి,(విజయక్రాంతి): నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని చిగురుమామిడి ఎంపీడీవో విజయ్‌కుమార్‌ సూచించారు. రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు గాను ప్రణాళికలకు రూపొందించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయ్ కుమార్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లతో ప్రణాళికకు శనివారం సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు గాను మండలంలోని అన్ని గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లతోపాటు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లు సమస్యలు తెలుసుకొని ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు.

ఇందుకోసం ఫిబ్రవరి 2 సీతారాంపూర్, లంబాడిపల్లి, 9న ముల్కనూర్, పీచుపల్లి, 10న రామంచ, ఓగులాపూర్, 11న ముధి మాణిక్యం, గునుకులపల్లి, 12న ఇందుర్తి, 13 సుందరగిరి, గాగిరెడ్డిపల్లి, 16 రేకొండ, 17 బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, 18 నవాబుపేట, కొండాపూర్, 19 చిగురుమామిడి మండల కేంద్రంలో తిరిగి సమస్యలు తెలుసుకుంటామని ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఆర్డబ్ల్యూఎస్, గ్రిడ్ ఏఈలు జ్ఞానేశ్వరి, సురేష్, ఎంపీఓ ఎండి కాజామోహినోద్దీన్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

నూతన సర్పంచులకు సన్మానం

ఇటీవల నూతనంగా ఎన్నికైన మండలంలోని సర్పంచ్‌లందరూ మొదటిసారిగా సమావేశానికి హాజరు కాగా, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయ్ కుమార్, తహసీల్దార్ రమేష్, ఎంపీవో ఖాజా మొహీనోద్దీన్ నూతన సర్పంచ్‌లను శాలువాతో ఘనంగా సత్కరించారు.