calender_icon.png 31 January, 2026 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 30, 30 ఏ పోలీస్ యాక్ట్ అమలు

31-01-2026 05:43:23 PM

పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించవద్దు

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో 30 ఏ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో  వుంచుకొని నెల రోజుల పాటు (ఫిబ్రవరి 1వ తేది నుండి 28 వరకు) జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ  హెచ్చరించారు.

జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా 4 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఇతర వ్యక్తులను గానికి, రాజకీయ పార్టీలను గాని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాద్యమాలలో పోస్టులు పేటిన చట్ట రిత్య కఠిన చర్యలు తప్పవని, హెచ్చరించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.