calender_icon.png 20 September, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్ కంట్రోలర్ జిఎం డివి సుబ్రహ్మణ్యం సేవలు మరువలేనివి

20-09-2025 07:51:42 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కొత్తగూడెం కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ జనరల్ మేనేజర్ డివి సుబ్రహ్మణ్యం సింగరేణికి అందించిన సేవలు మరువలేనివని ఆయన సేవలను ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కొనియాడారు. ఈనెల 30న పదవీ విరమణ పొందనున్న డివి సుబ్రహ్మణ్యం శనివారం ఏరియాలో పర్యటించగా, జిఎం కార్యాలయంలో ఆయనను ఏరియా జిఎం, జిఎం కార్యాలయ హెచ్వోడీ లు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా  ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఉద్యోగికి పదవి విరమణ తప్పదన్నారు.

పదవి విరమణ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా శేష జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు. సింగరేణిలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డిజిఎం ఈ అండ్ ఎం బాలాజీ భగవతి జా,కేకే ఓసిపి ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య, శాంతిఖని గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, ఏరియా రక్షణాధికారి భూశంకరయ్య, వర్క్ షాప్ డిజిఎం దూప్ సింగ్, ఐఈడి ఎస్ఈ కే కిరణ్ కుమార్, డిజిఎం ఎఫ్ అండ్ ఏ ఆర్విఎస్ఆర్కె ప్రసాద్, పర్చేస్ అధికారి బాబు, క్వాలిటీ అధికారి ప్రదీప్, ఐటి డివై  మేనేజర్ రవి, ఏరియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.