calender_icon.png 22 May, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీజేపీల నాటకమిది

22-05-2025 12:43:17 AM

  1. దూది పింజల్లా కాళేశ్వరం నోటీసులు
  2. న్యాయం, ధర్మమే గెలుస్తుంది
  3. కాంగ్రెస్‌ది కమీషన్ల పాలన
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్

నల్లగొండ టౌన్, మే 21: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజ ల్లా ఎగిరిపోతాయని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొంటున్నారని మండిపడ్డారు. ఎప్పటి కైనా న్యాయం, ధర్మమే గెలుస్తుందని, నిజాయతీ ఎప్పటికీ ఓడిపోదన్నారు.

కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ప్రజా సమస్యలపై కాకుండా పచ్చి నాటకంపై దృష్టి పెట్టాయని విమర్శించారు. నల్లగొండ పట్టణంలో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్.. మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌వి చిల్లర ప్రయత్నాలు అన్నారు. గత 17 నెలలుగా పాలన చేతకాక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని విమర్శించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేస్తుంటే విచారణలు, కమీషన్ల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఫైర్ అయ్యారు. కమీష న్లు తప్పా ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదని ఎద్దేవా చేశారు. కమీషన్లు ఇస్తేనే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే హీన స్థితికి చేరుకుందని కేటీఆర్ ఆరోపించారు.

కమీషన్ల కోసం ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో గల్లంతైన కార్మికుల మృతదేహాలను మూడు నెలలైనా ప్రభుత్వం బయటకు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. కమీషన్లు లేనిదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు ఏ పనులూ చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని తట్టుకోలేక కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.

నల్లగొండలో సుంకి షాల ప్రాజెక్ట్ కూలినా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారిని తిరస్కరిస్తారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధిచెప్పే రోజులు త్వరలోనే వస్తాయని, ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని కేటీఆర్ అన్నార కు.

కేటీఆర్ వెంట మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీందర్ నాయక్, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్ ఉన్నారు.