calender_icon.png 21 May, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టులు పూర్తిచేయడమే లక్ష్యం

21-05-2025 12:42:57 AM

  1. మండలి చైర్మన్ గుత్తా, మంత్రి ఉత్తమ్
  2. ధర్మారెడ్డిపల్లి కెనాల్, పిలాయిపల్లి కెనాల్, బునాదిగాని కెనాల్స్‌పై సమీక్ష 

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనే దృఢ సంక ల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మండలి చైైర్మన్ గుత్తా సుఖేం దర్‌రెడ్డి పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరంతంరం ఆయాశాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహి స్తూ పనులను త్వరగా పూర్తిచేస్తున్నారని ప్రశంసించారు.

జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారులతో కలిసి ధర్మారెడ్డిపల్లి కెనాల్, పిలాయిపల్లి కెనాల్, బునాదిగాని కెనాల్స్‌పై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత స మయంలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, ఐలయ్య, సామ్యేల్ పాల్గొన్నారు.