calender_icon.png 28 November, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి

28-11-2025 12:10:35 AM

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సుమన్

నస్పూర్, నవంబర్ 27: మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం బీఆర్‌ఎ స్ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. కార్యక్ర మం విజయవంతం కోసం పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్ష చేపట్టిన(దీక్షా దివస్) రోజున కార్యకర్తలు, నాయకులు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, సింగరేణి కార్మికులు, అనుబంధ సంఘ సభ్యులు జిల్లా పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.