calender_icon.png 28 November, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం చేసేవరకు దీక్షను విరమించను

28-11-2025 12:11:50 AM

రెండవ రోజుకు చేరిన సోయా రైతు దత్తాత్రి దీక్ష

కుంటాల, నవంబర్ 2౭ (విజయక్రాంతి): నాణ్యత పేరుతో రైతులకు ఇబ్బందులకు గురి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ రైతు పడకంటి దత్తాత్రి కుంటాల తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష రెండవ రోజు కొనసాగింది. పలువురు రైతులు మద్దతు తెలిపారు.జిల్లా కలెక్టర్, మార్క్‌పేడ్ అధికారులు వెంటనే స్పందించాలని,  ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

వర్షపాతం పరిస్థితుల కారణంగా ఏర్పడిన అవంతరాలకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేపట్టాలని నాణ్యత లోపం పేరుతో సాకులు చెబుతూ రైతులకు మోసం చేస్తే న్యాయం చేయకపోతే దీక్షను విరమించేది లేదని సిద్ధమేనని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే నాపేడ్ ద్వారా వాపస్ పంపిన సోయా బస్తాలను తిరిగి గోదాముకు తరలించాలని, ఎలాంటి షరతులు లేకుండా సోయా కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.