calender_icon.png 7 November, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూముల ధరల సవరణలో ఆలస్యం

13-08-2024 03:14:43 AM

  1. అమలుకు ఇంకొన్నాళ్లు   ఆగాల్సిందే..... 
  2. శాస్త్రీయత కోసం వాయిదా: అధికారులు  

వికారాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం రెండు నెలల క్రితం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పెంపు ఆగస్టు 1 నుంచే అమలులోకి వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ భూమి ధరల సవరణ విషయంలో మరింత శాస్త్రీయత అవస రమని ప్రభుత్వం కొంత ఆలస్యం చేస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు ఆనుగుణంగా రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు సమన్వయంతో భూముల విలు వలను ఎంతమేరా సవరించాలనే ఆంశంపై అంచనాలు వేసి నివేదికలు సిద్ధం చేశారు.

కానీ ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా లోనూ ప్రాంతాల వారీగా ధరల పెంపుపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్ విలువ అధికంగా ఉన్న ట్టు గుర్తించారని సమాచారం. ఈ వ్యత్యాసాలను సరిచేయాల్సిన సవరణలను ప్రతి  పాదనల్లో పొందుపర్చారు. అయితే మే 29 న కమిటీల ముందు ఉంచిన ప్రతిపాదిత ధరలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉన్నా ప్రభు త్వ సూచనలతో ప్రక్రియ నిలిచిపోయింది. 

అవసరమైతే థర్డ్ పార్టీ నివేదిక

కొన్నాళ్లుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూముల ధర బహిరంగ మార్కెట్‌లో పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వ ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్ విలువ నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నది. ఇంకొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ పెరగకపోవడం, అక్కడ ప్రభుత్వ విలువే అధికంగా ఉన్నట్లు అధికారులు  గుర్తించారు. దీంతో సవరణలు చేసి నివేదిక రూపొందించిన అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. విలువ పెంచు ప్రక్రి య ఆలస్యమైనా శాస్త్రీయంగా జరగాలనే భావనకు ప్రభుత్వ పెద్దలు రావడంతో అవసరమైతే థర్డ్ పార్టీ చేత నివేదిక సిద్ధం చేయిం చాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

జిల్లాలోని నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల విలువ సవరించి రూపొందించిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుత మార్కెట్ విలువ, బహిరంగ మార్కెట్ విలువల ఆధారంగా కనిష్ట, గరిష్ట ధరలను నిర్ణయించినట్లు సమాచారం. వికారాబాద్ పట్టణం చుట్టూపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెంచాలని నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో వాణిజ్య ప్రాంతాలను గుర్తించి నివేదిక తయారు చేయాలని  ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిసింది. 

ఈ  మేరకు అధికారులు ధరల సవరణకు ప్రతిపాదనలు సమర్పించి నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం శ్రావణమాసం మంచి రోజులు ఉండటంతో రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయి. దీంతో ధరల పెంపు ఎప్పుడు ఉంటుందా, ప్రభుత్వం మళ్లీ ఏమై నా మార్పులు సూచిస్తుందా అన్న కోణంలో రియల్టర్లు, ప్రజలు వేచి చూస్తున్నారు.