26-01-2026 01:44:36 AM
అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పార్టీల స్నేహ బంధం అలాగే ముందుకు సాగుతూనే ఉంది. వామపక్షాల దన్నుతో కాంగ్రెస్ పార్టీ 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ స్నేహబంధం ప్రతీ ఎన్నికల్లో కొనసాగుతుందని ఇటీవల కొత్తగూడెంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో మరోసారి స్పష్టమైం ది.
ఈ సభకు సీపీఐ రాష్ట్ర, జాతీయ ప్రతినిధులు నారాయణ, సాంబశివరావు, ముఖ్యఅ తిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆధ్యంతం కలిసి పనిచేద్దామని ఐక్య గొంతుతో వెల్లడించారు. కమ్యూనిస్టులతోనే కలిసి సాగుతామని, బీజేపీ డేంజర్ పార్టీ అని సీఎం రేవం త్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీపీఐ, కాంగ్రెస్ రాజకీయ పొత్తు ప్రాధాన్యతను మరోసారి తేట తెల్లం చేశారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కలిసి పనిచేసే పొలిటికల్ ప్రోగ్రామ్ ప్రాతిపదికగా ఈ రెండు పార్టీ లు కలసి పనిచేస్తున్నాయి.
బెల్లంపల్లి, జనవరి 25: మునిసిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, సీపీఐ పొత్తుతో బరిలోకి దిగుతాయనేది స్పష్టం అవుతున్నది. ఈ దిశగా మున్సిపల్ ఎన్నికల పొత్తులపై ఇరుపార్టీల మధ్య చర్చలు ఇంకా మొదలు కాలేదు. నోటిఫికేషన్ వస్తేగాని ఈ విషయంపై ఇరు పార్టీలు దృష్టి పెడతాయి. ఇప్పటివరకు ఇరు పార్టీల మధ్య ఉన్న అవగాహన మేరకు పొత్తులకే మొగ్గు కాగా సీపీఐ అధిష్టానం నుంచి అలయన్స్ నేపథ్యంలో స్థానికంగా ఎమ్మెల్యే స్థాయిలో పొత్తుల విషయమై సీట్ల పంపకాల పై సంప్రదింపుల కోసమని ఆదేశాలు మాత్రం వచ్చినట్లు సమాచారం.
సీపీఐ 20 స్థానాల్లో పోటీకి సై..
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జరిగే పొత్తు విషయం ఎలా ఉన్నప్పటికీ సీపీఐ బెల్లంపల్లి మునిసిపల్ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతుంది. ఉనికి కోసం వారి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ మేరకు 20 వార్డుల్లో అభ్యర్థులను పోటిలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అభ్యర్థుల ఎంపికలో తల మునుకలై ఉన్నారు. సీపీఐకి మొదటి నుంచి బెల్లంపల్లి కంచుకోట. నిర్మాణపరంగా బలంగా ఉంటుంది. దాని కార్మిక సంఘం ఏఐటీయూసీ సింగరేణిలో గుర్తింపు సంఘం కను క కార్మికక్షేత్రంలో ఆదరణ బలంగానే ఉంది.
బెల్లంపల్లి నుంచి సీపీఐ నాలుగు దఫాలుగా ప్రాతినిత్యం వహించింది. ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజవర్గాలో ఆ పార్టీ దివంగత నేత గుండా మల్లేష్ ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది. గెలుపు ఓటమీలని ప్రభావితం చేసే సత్తా సీపీఐకి ఉంది. గతంలో టీడీపీతో పొత్తు ఉండేది. అటు కార్మిక రంగంలో, ఇటు ప్రజల్లో బలమైన ఓటు బ్యాంక్ ఆ పార్టీకి ఉన్నది. సీపీఐతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు ఇప్పటి వరకు నష్టం వాటిల్లలేదు.
ఒకటి, రెండు ఇస్తే పొత్తుకు నో..
మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీతో సీపీఐ పొత్తులు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బలమైన ఓటు బ్యాం క్ ఉన్న ఆ పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి ప్రధాన డిమాండ్‌గా ఉంటుందని సమాచారం. ఒకటి, రెండు స్థానాలు ఇస్తే పొత్తుకు ఒప్పుకునే పరిస్థితిలో కామ్రేడ్లు లేరని తెలుస్తోంది. బెల్లంపల్లి మునిసిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో పోటీకి సిద్దమవుతోన్న సీపీఐకి కనీసం అందులో సగం స్థానాలైనా ఇస్తే కానీ పొత్తుకు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేద ని తెలుస్తోంది.
ఇదే విషయాన్ని సీసీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి స్పష్టం చేశారు. హై కమాండ్ నుంచి పొత్తుల విషయమై స్థాని క ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో సంప్రదింపులు జరపాలని ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో 20 వార్డుల్లో తాము పోటీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో తమకు ఒకటి, రెండు వార్డులు ఇస్తే మాత్రం పొత్తుకు అంగీకరించమని స్పష్టం చేశారు.
పొత్తుల కుదరకపోతే ఒం టరిగా తాము పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కానీ ఈ విషయం తేలిపోతుంది. కాంగ్రెస్, సీపీఐ పార్టీ ల మధ్య పొత్తు ఉంటుందా.. ఎవరికి వారే సింగిల్‌గా పోటీ చేస్తారా.. ? మరి కొద్ది రోజులు అనేది వేచిచూడాల్సిందే.