calender_icon.png 26 January, 2026 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుడందేవ్ జాతర ప్రారంభం

26-01-2026 01:39:42 AM

  1. ప్రత్యేక పూజలు నిర్వహించిన మెస్రం వంశీయులు
  2. బుడుం దేవ్‌ను దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జ పటేల్ 

ఉట్నూర్, జనవరి 25 (విజయక్రాంతి): పుష్య మాసం వచ్చిందంటే చాలు ఆదివాసీ గూడ ల్లో జాతరల సందడి మొదలవుతొంది. ఇప్పటికే ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర కొనసాగుతుండగా, తాజాగా ఉట్నూర్ మండలంలోని షాంపూర్‌లో కొలువైన బుడం దేవ్ జాత ర ప్రారంభమైంది. నాగోబా జాతరలో సాంప్రదాయ పూజలను ముగించుకున్న మెస్రం వంశీయులు బుడుం దేవ్ జాతరకోసం ఎడ్లబండ్లపై ఆలయానికి వచ్చారు. ఆదివారం బుడుం దేవ్‌కు సాంప్రదాయ బద్దంగా పూజ లు చేసిన మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించారు.

షాంపూర్‌లోని బుడం దేవ్ జాతర సందర్భంగా బుడుం దేవ్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ దర్శించుకున్నారు. ఆదివాసీలతో కలిసి ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా బేటింగ్‌లో పాల్గొన్న కొత్త కోడళ్ళ కు ఎమ్మెల్యే నూతన బట్టలు బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బుడందేవ్ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తన్నాని అన్నారు. ఆదివాసీలకు పుష్య మాసం ఎంతో పవిత్రమైన మాసం అని గుర్తు చేశారు. ఈ మాసంలో తమ తన దేవుళ్ళ జాతరలు నిర్వహించి, మొక్కులు తీర్చుకుంటారన్నారు.