26-01-2026 01:41:36 AM
ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత.. జాతీయ ఓటరు దినోత్సవంలో కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్/నిర్మల్/కుమ్రం భీం ఆసిఫాబాద్/వాంకిడి, జనవరి 25 (విజయక్రాంతి): మన రాజ్యాంగం మనకు కల్పించిన వజ్రాయుధం ‘ఓటు’ అని, ఓటు అనేది ప్రతి పౌరు ని ప్రాథమిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన 16వ జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి సమావేశ మందిరం వరకు ఓటరు చైతన్య ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఓటర్ దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ చేసారు. సీనియర్ ఓటర్, నూతన ఓటర్ లను శాలువాలతో సత్కరించి, అధికారులకు ప్రశం షా పత్రాలు అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ... ఓటు వేయకపోతే పాలకులను ప్రశ్నించే హక్కు నైతికంగా ఉండదని పేర్కొన్నారు.
ఓటర్లను ప్రలోభపెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, ఇలాంటి చర్యలను అరికట్టేందుకు అధికార యంత్రాం గం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాలని కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించబడతాయని, ప్రతి అర్హుడైన ఓటరు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని, ప్రస్తుతం ఓటరు నమోదు ప్రక్రియ చాలా సులభంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఆర్డీఓ స్రవంతి, డీఎస్పీ జీవన్ రెడ్డి, డీఐఈఓ జాదవ్ గణేష్, డివైఎస్‌ఓ జక్కు ల శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు కీలకం
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి అర్హత గల ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నా రు. ఈ సందర్భంగా ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ కేంద్రంలో 2కె రన్ కిలోమీటర్ల మేర అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఓటింగ్ శాతం పెరిగినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని, స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెవెన్యు కలెక్టర్ ఎం డేవిడ్ , రెవిన్యూ డివిజనల్ అధికారి లోకేశ్వర్ రావు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాలకులను ఎన్నుకునే అవకాశం
ప్రజాస్వామ్యంలో ఓటే .. వజ్రాయుధంమని, పాలకులను ఎన్నుకునే అవకా శం ఓటర్లకే ఉందని వాంకిడి తాసిల్దార్ కవిత అన్నారు. ఆదివారం తాసిల్దార్ కార్యా లయం ఆవరణలో 16వ జాతీ య ఓటర్ల దినోత్సవం సంద ర్భంగా ఉద్యో గులతో, కేజీబీవీ విద్యా ర్థులతో, ప్రజా ప్రతినిధు లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ...
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడంతో పాటు ఎన్నికలు జరిగినప్పుడు విధిగా ఓటు హక్కును వినియోగిం చు కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సర్పంచ్ సిహెచ్. సతీష్, ఉప సర్పంచ్ దీపక్ ముండే, తాసిల్దార్ కార్యాల యం సిబ్బంది, వాంకిడి ఎస్‌ఐ మహేందర్, ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.
ఓటును వినియోగించుకోవాలి: కలెక్టర్ అభిలాష అభినవ్
ఆదివారం నిర్మల్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభి లాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యా ర్థులందరూ సమాజంలో ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి సూచిక అని తెలిపారు. భారతదేశంలో ఓటు హక్కు అమలైన తీరును వివరించారు.
విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, పిల్లలందరికీ చిన్ననాటి నుంచే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలపాలన్నారు. సమావేశానికి హాజరైన వారితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాలలో పాలుపంచుకున్న విద్యార్థులకు, అధికారులకు, క్రమం తప్పకుండా పలు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లను, కలెక్టర్ సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.
వీరంతా సమాజానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని కలెక్టరేట్ ప్రాంగణంలో జెండాను ఊపి కలెక్టర్ ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బం ది, తదితరులు పాల్గొన్నారు.