calender_icon.png 19 January, 2026 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సెక్యులర్’ పదాన్ని తొలగించండి

15-11-2024 12:39:36 AM

దేశంలో 90 శాతం ప్రజలు ముస్లింలే

బంగ్లా సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్ వాదనలు

ఢాకా, నవంబర్ 14: బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఎండీ అజాదుజ్జామాన్ కోరారు. దేశంలో 90శాతం ప్రజలు ముస్లింలే ఉన్నప్పుడు రాజ్యాంగంలో ‘సెక్యులర్’ పదం ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు దేశ రాజ్యంగంలో మరిన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. షేక్ ముజిబర్ రెహమాన్‌ను జాతి పితగా పిలవాలనే నిబంధనను తొలగించాలన్నా రు.

ఈ నిబంధన జాతీయ విభజనకు దోహ దం చేయడంతోపాటు వాక్ స్వాతంత్య్రానికి విఘాతం కలిగిస్తోందన్నారు. అయితే షేక్ ముజిబర్ సేవలను గుర్తించడం ముఖ్యమే అయినప్పటికీ దాన్ని చట్టం ద్వారా అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 

హాసీనా దేశాన్ని వీడి 100 రోజులు 

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఇండి యాకు వచ్చి సరిగ్గా 100 రోజులు పూర్తుంది. తిరుగుబాటుతో ఈ ఏడాది ఆగస్ట్ 5న బంగ్లాను వీడిన ఆమె కట్టుదిట్టమైన సెక్యూరిటీ నడుమ భారత్‌కు చేరుకున్నారు.