07-07-2025 12:30:07 AM
ఆరోపించిన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు
ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి) : గత పది సంవత్సరాల నుండి అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించకుండా అమరా వాది లక్ష్మీనారాయణ గత ప్రభుత్వ అండదండలతో అధికారం చెలాయించాడని తెలంగా ణ ఆర్యవైశ్య మహాసభ ఆరోపించింది. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలపై కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం గెలిచిందని ఆర్యవైశ్య మహాసభ తెలిపింది.
హైదరాబాద్ హైదర్ గూడ లోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు మిడిదొడ్డి శ్యాంసుందర్, మహాసభ ప్రక్షాళన కన్వీనర్ మొగుళ్ళపల్లి ఉపేందర్ లు మాట్లాడుతూ.. అమరావాది తన అనుకూలమైన వారిని ఎన్నికల అధికారిగా నియమించి అక్రమాలకు తెరలేపారని వారు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం అమరావాది బ్రష్టు పట్టించి బైలాను తుంగలోకి తొక్కాడని విమర్శించారు.
పది వేలు ఉన్న నామినేషన్ ఫీజు ను లక్షకు పెం చారని, ఐవీఎఫ్ అండ్ వామ్ సభ్యులను పోటీకి అనర్హులుగా ప్రకటించి ప్రజాస్వామాన్ని తుంగలో తొక్కారన్నారు. ప్రభు త్వం ఏర్పా టు చేసిన కమిటీచే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారికి కోర్టు తీర్పు కాపీ అందజేశామ ని, త్వరలో ఎన్నికలు బైలా ప్రకారంగా పెట్టాలని కోరమని తెలిపారు.
2 ఏళ్ల పదవి కి 11 ఏళ్ళు ఉన్నారని, అమరావాది కి పోటీ చేసే అర్హత లేదని కోర్ట్ స్పష్టమైన తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అమ రా వాది బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధం గా ఎన్నికలకు సహకరించకుంటే చరిత్రలో ఆయ న చేసిన అక్రమాలు నిలిచిపోతాయన్నారు.