calender_icon.png 7 July, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి

07-07-2025 12:28:45 AM

రాహుల్ గాంధీకి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం లేఖ

ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ బ్ లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీకి పలు డిమాండ్లతో కూడిన లేఖ విడుదల చేసి మాట్లా డారు.

ఎన్నికలలో సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, రూ.25 వేల పెన్షన్ సౌకర్యం తోపాటు ఉధ్యమకారుల ఆత్మగౌరవ సంక్షేమం కోసం ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు కార్డు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలలో 20 శాతం వాటా, సంక్షేమ బోర్డు ఏర్పాటుకై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా స్పష్టమైన ప్రకటన చేయించాలని లేఖలో పేర్కొన్నారు.

తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్పష్టమైన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థ ఎన్నికలలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల బరిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర కమిటీ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు సురేందర్ రెడ్డి, దయానంద్, గగన్ కుమార్, జానకి రెడ్డి, ఇంద్ర కుమార్, రాంబాబు, జగన్ యాదవ్, విష్ణువర్ధన్, శ్యామల, అనంతలక్ష్మి వీరస్వామి, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, భాను ప్రకాష్, గౌస్, సుదర్శన్, భాస్కర్ చంద్రశేఖర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.