07-07-2025 12:31:07 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జులై (విజయ క్రాంతి):సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో రథయాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. విఠల నామస్మరణతో పురవీధులు మార్మోగగా, ఈ యాత్ర ప్రశాంత వాతావరణంలో ముగిసింది.జనరల్ బజార్లోని ఆలయం నుంచి ప్రారంభమైన ఈ రథోత్సవం, మోండా మార్కెట్ మీదుగా సాగి, తిరిగి ఆలయానికి చేరుకోవడంతో పరిసమాప్తమైంది.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. రథయాత్రకు విద్యుత్ అంతరాయం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు విద్యుత్ శాఖ ఏఈ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ సిబ్బంది శంకర్, వెంకన్న, రాకేష్లు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని, యాత్ర మార్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారని, వారి సహకారంతో ఉత్సవం సజావుగా ముగిసిందని ఆయన ప్రశంసించారు.