25-01-2026 12:58:10 AM
సీఈఓ ఆదేశాలతో కూల్చివేసిన కంటోన్మెంట్ బోర్డ్ అధికారులు
కంటోన్మెంట్,జనవరి24 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అక్రమ నిర్మాణాలపై బోర్డు అధికారులు కొరడా ఝుళిపించారు.రక్షణ శాఖకు చెందిన ఓ భవనంలో అక్రమంగా నిర్మించిన షెడ్లను శనివారం బోర్డు అధికారులు,టౌన్ ప్లానింగ్ ఇంజనీర్లు ఉమాశంకర్,ఫణికుమార్ ఆధ్వర్యంలో కూల్చివేతలు నిర్వహించారు. వివరా ల్లోకెళ్తే బోర్డు పరిధిలోని టీవోలీ చౌరస్తాలో రక్షణ శాఖ యాజమాన్య హక్కులు కలిగి ఉన్న బీ 3 బంగ్లా నెంబర్ 221బి లో కొంద రు అక్రమంగా షెడ్లు నిర్మించ అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
శనివారం రక్షణ శాఖ పరిధిలోని స్థలాల్లో అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసినా అక్రమ నిర్మాణదారులు స్పందించకపోవడంతో బోర్డు సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది ఆదేశాలు మేరకు బోర్డు ఉన్నత అధికారులు శనివారం అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ షెడ్లను జెసిబి తోకంటోన్మెంట్ అధికారులు కూల్చివేశారు. రక్షణ శాఖ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడం నిషేధమని, ఇలాంటి అక్రమ నిర్మాణాలను చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డ్ అధికారులు హెచ్చరించారు.ఈ కూల్చివేతల్లో కంటోన్మెంట్ బోర్డు అధికారులు, టౌన్ ప్లానింగ్ ఇంజనీర్లు ఉమా శంకర్, ఫణి కుమార్, బోర్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.