25-10-2025 12:37:49 AM
ఘట్‌కేసర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : పోచారం మున్సిపల్ ప్రతాప సింగారంలో హైడ్రా, పోచారం మున్సిపల్ అధికారులు కలిసి శుక్రవారం అక్రమ నిర్మాణాలు కూల్చి వేశారు. ప్రతాపసింగారంలో సర్వే నెంబర్ లు 315, 316, 317 భవానీనగర్ (బుచ్చిరెడ్డి లేవుట్) లో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి 6.14 ఎకరాలలో ప్రహరీగోడ అక్రమంగా నిర్మించి ప్రజలకు సంబంధించిన 88 ప్లాట్లు ఆక్రమించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు హైడ్రా, పోచారం మున్సిపల్ అధికారులు సంయుక్తంగా జెసిబితో కూల్చి వేయించారు. దీంతో కాలనీ వాసులు హైడ్రా, మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.