13 May, 2026 | 1:30 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

13-05-2026 12:00 AM

కుత్బుల్లాపూర్, మే 12(విజయక్రాంతి): దుండిగల్ సర్కిల్ పరిధిలోని అనుమతి లేని ఓ అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. బహదూర్‌పల్లి పరిధిలోని టెక్ మహీంద్రా ఎదురుగా ఓ నిర్మాణదారుడు ఎలాంటి అనుమతి లేకుండా జీ+5 నిర్మాణం చేపడుతున్నాడు. ఈ అక్రమ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదులు అందడంతో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకట మణికరన్ ఆదేశాల మేరకు కట్టర్స్‌తో స్లాబ్, గోడలను కూల్చివేశారు. ఈ కూల్చివేతలో ఏసీపీ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.