16-07-2025 12:00:00 AM
నివాసాల కూల్చివేతలపై చల్మెడ సంచలన వ్యాఖ్యలు
రాజన్న సిరిసిల్ల:జూలై 15 (విజయక్రాంతి) పరిహారం లేని కూల్చివేతలు అధికారంలో ఉన్నారు కదా అని ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు తగ వు‘ అంటూ బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మి నరసింహారావు మండిపడ్డారు. వేముల వాడ పట్టణ ప్రధాన రహదారి విస్తరణలో నిర్వాసితులపై ప్రభుత్మ తీరును దుయ్యబట్టారు.పరిహారం ఇవ్వకుండా, కనీస నోటీసులు లేకుండా, అర్ధరాత్రి జెసిబిలతో కూల్చివేతలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చుబెట్టే చర్యలేనని విమర్శించారు.
స్థానిక ఎమ్మెల్యే అది శ్రీనివాస్ దగ్గరకు బాధితులు వెళ్లి ఒకరోజు గడువు ఇవ్వమంటే ఇవ్వడం లేదన్నారు.ఆగమేఘాల మిద గంట కూడా సమయం ఇవ్వకుండా ప్రధాన రహదారిలో దుఖానాలను, ఇండ్లను కూల్చి వేసి ఇప్పటి వరకు కూడా తట్టెడు మట్టి ఎత్తడం లేదన్నారు. మూల వాగు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి నెల రోజులు గడుస్తున్నా, పని ఎందు కు వినిపించలేదు జనానికి చెప్పాలన్నారు.తిప్పాపూర్లో గజానికి రూ.8500 పరిహారం చాలు అని చెబుతారా? అని నిలదీశారు.
పదేండ్ల లో బిఆర్ ఎస్ ప్రభుత్వం చేయలేని పనులు మేము చేస్తున్న అని చెప్తున్నారని, మేము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కదా అని కక్ష పూరితంగా వ్యవహరించలేం,మేము బాధితుల పక్షాన నిలబడతాం అని స్పష్టం చేశారు.మూలవాగు వద్ద రెండో వంతెన నిర్మాణానికి భూసేకరణ పేరుతో ప్రజల జీవనోపాధిపై ప్రభుత్వం వేటు వేస్తున్న తీరు బాధాకరమన్నారు. నిర్వసితులకోసం భవనం కడుతున్నామన్నది కోర్టులో చెబుతున్న ప్రభుత్వం... కానీ నిర్వాసితులకు సమాచారం ఇవ్వకపోవడం విడ్డూరం అన్నారు. వేములవాడ అభివృద్ధి దేవుడెరుగు కానీ, కక్షపాలన జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేయాలి కానీ కక్ష సాధింపు చర్యలు తగవు. అని చల్మెడ తీవ్రంగా హెచ్చరించారు.