16-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): పేదలకు రేషన్ కార్డులు అందించే కార్యక్రమం విజయవంతం కావడంతో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. ‘జగదీశ్ రెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాలి. సూర్యాపేటకు ఉపఎన్నికల్లో ఆయన మళ్లీ గెలిస్తే.. నేను రాజకీయాల నుంచి శాశ్వత ంగా తప్పుకుంటా’ అని వీరేశం సవాల్ విసిరారు.
ఆయనపై పోటీకి తాను లేదా బీర్ల అ యిలయ్య సిద్ధమని ప్రకటించారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వీరేశం మీ డియాతో మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జి ల్లాలో ఉనికి కోసమే జగదీశ్‌రెడ్డి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడని విమర్శించారు.
బీఆర్‌ఎస్ పాలనలో నల్గొండ జిల్లాలో కేవలం 25 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారని, మరీ ఆరు లక్షల కార్డులు ఇచ్చామన్న జగదీశ్‌రెడ్డిని చెంపదెబ్బ కొట్టాలా లేక కట్టెలతో కొట్టాలా అని ని లదీశారు. నల్గొండ జిల్లాకు జగదీశ్‌రెడ్డి శనిలా దా పురించాడని ఆగ్రహం వ్యక్తం చేశా రు.
మంత్రి పదవికి ముందు, ఆ తర్వాత జగదీశ్ రెడ్డి ఆస్తులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. మాజీ ఎమ్మె ల్యే కిషోర్ బూతుల్లో పీహెచ్‌డీ చేశాడని వీరేశం మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు నూకలు చె ల్లాయ ని విప్ బీర్ల అయిలయ్య అన్నారు. జగదీశ్ రెడ్డి ఒక జోకర్ అని, జడ్పీటీసీకి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ ఆని విమర్శించారు. సీఎం రేవంత్‌గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు.