calender_icon.png 16 November, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక 24/7 డెంటల్ సేవలు

16-11-2025 12:30:44 AM

-నానక్‌రాంగూడాలో త్వరలో ‘టూత్ విష్’ హాస్పిటల్ ప్రారంభం

-హాస్పిటల్ పేరు, లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): నానకరంగూడాలో త్వరలో ప్రారంభం కానున్న ‘టూత్ విష్ 24/7 డెంటల్ హాస్పిటల్’ పేరు, లోగో, అధికారిక వెబ్‌సైట్‌ను శనివారం బంజారాహిల్స్ లోని హయత్ ప్లేస్ హోటల్‌లో ఆవిష్కరించారు. వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ శ్రావంతి ఎల్లసిరి, సహ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ రాథోడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అత్యవసర దంత చికిత్సను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పలు క్లినిక్‌ను 24/7గా అందిస్తు న్నాయి. టూత్ విష్ మాత్రం తాము మొదటిసారిగా అత్యవసర చికిత్స అందిస్తు న్నామని ఎలాంటి హక్కువాదన చేయడం లేదు. ఈ హాస్పిటల్ 24/7 హాస్పిటల్ మోడల్‌ను, ఇది సాధారణ రాత్రివేళల క్లినిక్‌లకు భిన్నంగా మూడు ముఖ్య అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అవి 1) ఎండోడాంటిక్స్, ఇంప్లాంట్స్, ఆర్థోడాంటిక్స్, పిల్లల దంత సంరక్షణ, కాస్మెటిక్ డెంటిస్ట్రీ వంటి అన్ని ప్రత్యేక విభాగాల సమగ్ర అందుబాటు. 2) హాస్పిటల్-స్థాయి డయాగ్నస్టిక్స్, ఆధునిక పరికరాలతో కూడిన మౌలిక సదుపాయాలు. 3) రోగులకు నిమ్మళమైన, ఆత్మవిశ్వాసం కలిగించే వాతావరణం. 4) డిజిటల్ సదుపాయాల్లో కొత్త వ్బుసైట్, ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం. డా. శ్రవంతి ఎల్లసిరి మాట్లాడుతూ.. ‘అనేక క్లినిక్‌లు అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్నాయి.

మేము వారు చేస్తున్న సేవలను గౌరవిస్తాం. టూత్ విష్ ద్వారా మేము నిర్మిస్తోంది పూర్తి స్థాయి, హాస్పిటల్ -లెవల్ 24/7 ఫెసిలిటీ అత్యవసర పరిస్థితులు మాత్రమే కాదు, సమగ్ర దంత సేవలు కూడా నిరంతరం అందిస్తాం’ అని తెలిపారు. డా. రవిశంకర్ రాథోడ్ మాట్లాడు తూ.. ‘హైదరాబాద్‌లో విశ్వసనీయమైన, మల్టీస్పెషాలిటీ, ఆధునిక డయాగ్నస్టిక్స్‌తో కూడిన 24/7 డెంటల్ హాస్పిటల్‌గా సేవ చేయడమే’ అని అన్నారు.