calender_icon.png 16 November, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పెద్దమ్మతల్లి బోనాలు

16-11-2025 12:30:12 AM

బోనాలు సమర్పించిన ముదిరాజ్ కులస్తులు

హుజురాబాద్, నవంబర్ 15 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని రంగనాయకులగుట్ట వద్ద నూత నంగా నిర్మించిన పెద్దమ్మతల్లి దేవాలయంలో అమ్మవారికి ముదిరాజ్ కులస్తులు శనివారం బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా గత నాలుగు రోజులుగా యజ్ఞాలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శనివారం అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనంతో తల్లి వద్దకు కదిలారు. మహిళలు, యువతులు, శివసత్తులు డప్పు చప్పుళ్లు మధ్య ఊరేగింపుగా చేరుకొని తల్లికి బోనాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు. భక్తు లు అధికసంఖ్యలో  రావడంతో ఆలయప్రాంగణం కోలాహలంగా మారింది.