13-11-2025 09:52:48 PM
అవమానం పట్ల జిల్లా అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బిజెపి నాయకులు
మునుగోడు (విజయక్రాంతి): హనుమాన్ దీక్ష తీసుకున్న విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలలో అవమాన పరిచిన ఉపాధ్యాయునిపై విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు అన్నారు. గురువారం భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. మునుగోడు మండలం పలివెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కొండేటి శివ శంకర్ అనే విద్యార్థి ఇటీవల హనుమాన్ మాలాధారణ వేసుకుని పాఠశాలకు వెళ్లిన విద్యార్థి పట్ల తెలుగు ఉపాధ్యాయుడు నరసింహ దురుసుగా, ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశాడని అన్నారు.
కులమతాలకతీతంగా విద్యార్థులకు విద్యాబోధన నేర్పించాల్సిన అవమానించేలా పవిత్ర రుద్రాక్షలను ధరించి దీక్ష తీసుకున్న విద్యార్థిని పాఠశాలకు రావాలంటే మాల తీసివేసి యూనిఫామ్ వేసుకుని రావాలని లేకపోతే పాఠశాలకు రానివ్వమని బెదిరించినట్లు విద్యార్థి తెలిపినాడని అన్నారు.హిందూ మతాన్ని అగౌరపరిచిన తెలుగు ఉపాధ్యాయుడు నరసింహ విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం రాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోలి మధుసూదన్ రెడ్డి, మండల వెంకన్న, మిర్యాల వెంకటేశం, పిన్నింటి నరేందర్ రెడ్డి,నవీన్ రెడ్డి,శాంతి స్వరూప్ ,శివరామకృష్ణ, దాసరి కృష్ణ, మేకల అనిల్, పులకరం బిక్షం, ఉన్నారు.