21 August, 2026 | 2:51 AM

బయో మెడికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ ధ్వంసం

14-06-2024 05:56 PM

హైదరాబాద్ : నగర సమీపంలోని బయో మెడికల్ ఫ్యాక్టరీలో అధికారులు భారీగా డ్రగ్స్ ధ్వంసం చేశారు. ఈ ఘటన సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. 3 ఏళ్లుగా పట్టుకున్న వివిధ రకాల డ్రగ్స్ ను అధికారులు శుక్రవారం ధ్వంసం చేశారు. 5 వేల కిలోల డ్రగ్స్ ను ధ్వంసం చేసినట్లు అధికారులు ప్రకటించారు. 30 పీఎస్ ల పరిధిలో 122 కేసుల్లో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ధ్వంసం చేసిన వాటిలో 2600 లీటర్ల హాష్ ఆయిల్, కొకైన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.