టీజీ ఐసెట్ ఫలితాలు విడుదల
14-06-2024 05:14 PM
హైదరాబాద్ : టీజీ ఐసెట్ ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యాయి. ఈ ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జీ వీసీ వాకాటి కరుణ ప్రకటించారు. తెలంగాణ 2024-2025 ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 5,6 తేదీల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ఐసెట్ పరీక్షకు 86,156 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 77,942 మంది హాజరయ్యారు. వీరిలో 71,647 మంది అర్హత సాధించగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైందని ఉన్నతాధికారులు వెల్లడించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://icet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు.






