calender_icon.png 4 November, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం

04-11-2025 07:11:18 PM

దేవరకొండ,(విజయక్రాంతి): కొండ మల్లేపల్లి మండల  కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో  చిన్న అడిశర్లపల్లి, పెండ్లి పాకాల (బాబ్ల తండ) గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి స్థానిక కొండ మల్లేపల్లి మండల పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మాలని రైతులకు సూచించారు.

రైతులెవరు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని పేర్కొన్నారు, ధాన్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, గన్ని బ్యాగులు అవసరం ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులను కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.