calender_icon.png 23 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తు దృష్ట్యా అభివృద్ధి చేయండి

23-01-2026 12:31:20 AM

మైలార్దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి

రాజేంద్రనగర్, జనవరి 22 (విజయక్రాంతి) : భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని మైలార్దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి అధికారికి సూచించారు. గురువారం మైలర్ దేవ్ పల్లిలో జాయింట్ కలెక్షన్ పనులు పూర్తి అయ్యే విధంగా రూ. 20 లక్షల రూపాయలతో నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులలో ఎక్కడ కూడా నాణ్యత లోపాలు లేకుండా పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పనే ద్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్ర మంలో హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ అండ్ శివరేజ్ బోర్డు అధికారులు ఖదీర్ లోక్నాథ స్థానిక బస్తీ నాయకులు పిల్లి శేఖర్ యాదవ్, కుంబ యాదయ్య, జగన్ యాదవ్ , మళ్లిఖార్జున, దయానంద్,రామిడి మధుసూదన్ రెడ్డి, ఎన్ను శంకర్ రెడ్డి, గుమ్మడి రవీందర్ రెడ్డి, కే.ఎన్. ఉమామహేశ్వర్, కే.ఎన్. దయానంద్, మజర్, జిహెచ్‌ఎంసి సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.