calender_icon.png 23 January, 2026 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల దృష్టి మళ్లించేందుకే నోటీసులు

23-01-2026 12:33:29 AM

తలసాని సాయి కిరణ్ యాదవ్

సనత్నగర్, జనవరి 22 (విజయక్రాంతి): - మొన్న హరీష్ రావు కు,ఇవాళ కేటీఆర్,  నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యే అని తలసాని సాయి కిరణ్  యాదవ్ కాంగ్రెస్  ప్రభుత్వం పాలనను వదిలేసి, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో యూరి యా దొరకక రైతులు అల్లాడుతున్నా, రైతు భరోసా ఊసే లేదని ధ్వజమెత్తారు.ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ వంటి కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవని, రెండేళ్లుగా దర్యాప్తు చేసినా ఏమీ తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి సర్కారు ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా వాటన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.