13-12-2025 12:08:23 AM
మేడిపల్లి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ జిహెచ్‌ఎంసి విస్తరణ పై పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. జిహెచ్‌ఎంసి విస్తరణ ప్రక్రియలో భాగంగా జరిగిన తాజా వార్డుల పునర్విభజన, స్థానిక ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందన్నారు. మాజీ మేయర్ జక్క వెంక రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు కలిసి, శుక్రవారం నాడు డిప్యూటీ కమిషనర్ త్రిలేశ్వర్రావు కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ తోనే సాధ్యమని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ,కొత్త జిల్లాలు, రెవిన్యూ విభాగాలు, మున్సిపాలిటీలు వంటి, నమస్కరణ లు అభివృద్ధిని మరింత వేగవంతం చేశాయి అన్నారు. జిహెచ్‌ఎంసిని 300 వార్డులతో కార్పొరేషన్ గా విస్తరించడం వల్ల, పౌర సేవలు, సకాలంలో చేరడంలో తీవ్ర ఇబ్బందులు వస్తాయి, అంతేకాకుండా స్థానికంగా ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, అభివృద్ధి పనులు నేమ్మదిస్తాయన్నారు.
జిహెచ్‌ఎంసిని హైదరాబాద్ ఈస్ట్, హైదరా బాద్ వేస్ట్, హైదరాబాదు నార్త్, హైదరాబాద్ సెంట్రల్/సౌత్ నాలుగు వేరు వేరు, కార్పొరేషన్లుగా విభజించాలని, డిమాండ్ చేశారు. జిహెచ్‌ఎంసి రీడిజన్ చేయాలని, డ్రాఫ్ట్ గెజిట్ వెంటనే పున పరిశీలించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొల్తూరు మహేష్, మధుసూదన్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి రఘు వర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, జావిద్ ఖాన్, యూత్ అధ్యక్షులు ప్రభు, లగ్గానీ సోమేశ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.