13-12-2025 12:01:35 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 12, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈనెల 29 ,30 వ తేదీలలో జరిగే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు తెలిసే విధంగా, ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించా రు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో ఈనెలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనంనకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే విధంగా పూర్తి సమాచారం తెలియడానికి గోడపత్రికలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా అంటించడం జరుగుతుందని అన్నారు.
అలాగే భక్తులకు కల్పించవలసిన వసతి సౌకర్యాల గురించి ఏర్పాట్లపై సోమవారం నాడు15 తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు సబ్ కలెక్టర్ రేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలోడివిజనల్ లెవెల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనంనకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు కల్పించవలసిన వసతి సౌకర్యాలపై సంబంధిత డివిజన్ అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, అర్చక స్వాములు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.