30-09-2025 01:08:33 AM
ఎవరి ఆలోచనలకు అంతుచిక్కరు
అసాధ్యులు... ఆ అన్న దమ్ములు
మారుతున్న మంథని రూపురేఖలు
తాజాగా రామగిరి రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్
మంథని, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి) అభివృద్ధి పథం...అ మంత్రి పంతం...అసాధ్యులంటే నిజంగా వారే... విమర్శలను లెక్క చేయరు... అభివృద్ధిలో రాజీ పడరు... ఎవరి ఆలోచనలకు కూడా అంతుచిక్కరు.. ఆ జన నేతలు.. అభివృద్ధి పధం.. వారి పంతం అన్నట్టుగానే ముందుకు సాగిపోతున్నారు. తండ్రి శ్రీపాద బాటలో నడుస్తూ నాడు అన్న గీసిన గీతను ఆ లక్ష్మణుడు దాటాడేమో గానీ...మం థని లక్ష్మణుడు శ్రీను బాబు మాత్రం అన్న మాటకు ఎదురుచెప్పుడు..
అన్న లేని లోటు ప్రజలకు తెలియనీయడు.. ఇదంతా మంథ ని నియోజకవర్గ ప్రజలకు కొత్తగా పరిచ యం చేయనక్కర్లేదు అనుకోండి.. మంథని నియోజక వర్గ రూపురేఖలు ప్రజలు చూ స్తుండగానే చకచకగా మారుతున్నాయనడానికి తాజాగా రామగిరి మండలంలో గల చా రిత్రాత్మక రామగిరి రోప్ వే నిర్మాణంకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే... ప ట్టు వదలని ఆ విక్రమార్కుడు.. మాటిచ్చి మ డమ తిప్పని అసాధ్యుడు రాష్ట్ర మంత్రి శ్రీ ధర్ బాబు అని మరో నిరూపణ జరిగింది.
రామగిరి రోప్ వే కు గ్రీన్ సిగ్నల్ మంత్రి శ్రీధర్ బాబు గణితే..
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా గుర్తింపు తెచ్చుకోవడమంటే సామాన్య విషయం కాదు. రాష్ట్ర ప్రగతితోపాటు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మంథని నియోజక వర్గం గురించి అన్ని విధాలుగా ఆలోచిస్తున్న మంత్రి శ్రీధరాబాబు 2024 సంవత్సరంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగిరి మండల పర్యటనకు వచ్చిన సందర్భం లో నేల తల్లి సాక్షిగా తన స్థాయిని పక్కనబెట్టి ఈజీఎస్ మహిళలతో కలిసి కటిక నేలపై కూర్చొని రామగిరి రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రంగా గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చిన విషయం విధిత మే.
అ నేపథ్యంలోనే దేవాదాయ, ధర్మదా య శాఖతో మాట్లాడి తెలంగాణ ప్రభుత్వం ను ఒప్పంచి రామగిరి అభివృద్ధికి రూ.5 కోట్లు నిధులు కేటాయించారు. ఎన్నో యేళ్లు గా అభివృద్ధికి దూరంగా ఉంటున్న రామగిరి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమా అని ప్రతిపక్షాలు కొట్టిపారేశారు. కానీ, ఆ విమర్శలను ఏనాడూ లెక్కచేయని మంత్రి శ్రీధర్ బాబు ఇప్పుడు ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా మౌనంగా సమాధానం ఇచ్చారు.
ఎవరూ ఊహించని విధంగా రామగిరిరోప్ వే నిర్మా ణం చేపట్టాలన్న ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించి ఇంతకాలం వాటిపైనే దృష్టి కేంద్రీకరించారని ఇప్పుడు తేలిపోయింది. రామగిరి రూ.2.46 కోట్ల వ్యయంతో 2.4 కిలోమీటర్ల రోప్ వే నిర్మాణంకు కేంద్రం నుంచి పచ్చ జెండా తీసు కొచ్చారు. దీని ద్వారా కోట పాదాల నుంచి కొండపైభాగంకు భక్తులు, పర్యాటకులు సు లువుగా సురక్షితంగా చేరుకునే అవకాశం ఉంది.
అలాగే పరిసరాల్లో మరో రూ.2.5 కోట్లతో ఇతర అభివృద్ధి పనులకు నిధుల మంజూరుకు కృషి చేశారు. రామగిరి ఈ రో ప్వే నిర్మాణంతో పర్యాటక కేంద్రంగా పూర్తి స్థాయిలో అభివృద్ధికిలోకి వస్తుండటంతో ని యోజక వర్గ ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపారు.
అటు గోదావరిపై వంతెన...
రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మంత్రి శ్రీధరాబాబు తొలు త ఈ ప్రాంత అభివృద్ధికి తొలి పునాధి రా యి వేశారు. మంథని గోదావరి నదిపై మరో వంతెన నిర్మాణంకు రూ.125 కోట్లు మం జూరు చేయించారు. పెద్దపల్లి- మంచిర్యాల జి ల్లాల మధ్య వారధి నిర్మాణంకు శ్రీకారం చు ట్టారు.
ఇటు మంథని గోదావరి నది నుంచి 25 పిల్లర్లతో ఈ వంతెన నిర్మాణం జరుగుతూ అటు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివ్వారం అటవీ ప్రాంతం వరకు కొనసాగుతుంది. నిర్మాణంతో దూర భారం తగ్గడమే కాకుండా జాతీయ రహదారులకు అనుసంధానం కానుంది. ఇప్పటికే పనులు చేరవేగంగా జరుగుతున్న సంగతి విధితమే.