calender_icon.png 23 October, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీం స్ఫూర్తితో అభివృద్ధి చేయాలి

22-10-2025 06:23:38 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదివాసి వీరుడు కుమ్రం భీం 125వ జయంతి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ, భీం పేరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడడం మానుకుని, పోరు గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరారు.

భీం ఆశయాలకు న్యాయం కావాలంటే రౌట సంకెనపల్లి సహా ఆదివాసి ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా రంగాలు అభివృద్ధి చెందాలని సూచించారు. ఆయన పేరుతో ఉన్న ప్రాజెక్టులు రైతులకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. జయంతులు, వర్ధంతులు పండుగలుగా జరపడం కంటే ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు గెడం టికానంద్, గోడిసేల కార్తిక్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు జె. రాజేందర్, ఉపాధ్యక్షుడు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.