calender_icon.png 23 October, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ యువకుడు మృతి..

22-10-2025 06:27:34 PM

తలకొండపల్లి: ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన తలకొండపల్లి మండల పోలీస్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం తలకొండపల్లి మండలం గర్విపల్లి గ్రామానికి చెందిన వస్పుల మల్లేష్(27) అనే యువకుడు తుక్కుగూడలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి విషయంలో తరచు తండ్రితో గొడవ పడెవాడు. జీవితంపై విరక్తి చెంది ఈ నెల 18వ తేదీనాడు పురుగుల మందు తాగాడు.

గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్లు తెలిపారని ఎస్సై శ్రీకాంత్ వివరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.