05-05-2025 12:07:17 AM
గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, మే 4 (విజయ క్రాంతి) : అభివృద్ధి పనులు త్వరితగతన చేపట్టాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అధికారులకు సూచించారు. గాంధీనగర్ డివిజన్ లోని అశోక్ నగర్ సర్కిల్ లో జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం చేపట్టిన చౌరస్తా సుందరీకరణ పనులను ఆదివారం గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పరిశీలించారు.
విభిన్న రంగులతో కళాకృతులు చిత్రీకరించి డివిజన్ లోని చౌరస్తాలను సుదరికరించే పనులు జరుగుతున్నా యి. అధికారులు పనులను వేగవంతం గా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, బీజేపీ నేతలు శ్రీకాంత్, సురేష్ రాజు, నీరజ్, తదితరులు పాల్గొన్నారు.