calender_icon.png 17 May, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీవీ ఆనంద్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

17-05-2025 05:58:49 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి తెలంగాణ పోలీసు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్’ కేటగిరీలో మొదటి బహుమతిని అందుకున్న సందర్భంగా హైదరాబాద్ సీటీ పోలీస్ సీవీ ఆనంద్ శనివారం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. దుబాయ్‌లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్‌-2025లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.