17-05-2025 06:27:23 PM
జిల్లా కలెక్టర్ కు టిపిటిఎఫ్ వినతిపత్రం..
గజ్వేల్: పాఠశాలల పరిశుభ్రత కోసం పనిచేస్తున్న స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్యాల విజేందర్ రెడ్డి, సుంచు నరేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కార్యదర్శి సత్యనారాయణతో కలిసి జిల్లా కలెక్టర్ మనుచౌదరి(District Collector Manu Chowdary)కి శనివారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ.. పాఠశాలల పరిశుభ్రత కోసం స్కావెంజర్లను నియమిస్తూ, వారికి పది నెలల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఆరు మాసాలకు సంబంధించిన వేతనాలు మాత్రమే విడుదల అయ్యాయని, పెండింగ్ లో ఉన్న నాలుగు మాసాల వేతనాలు విడుదల చేయాలని కోరారు. 6, 7 తరగతులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ లను అందించాలని, పాఠశాలల్లో కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ లను నియమించాలని సూచించారు. అలాగే పాఠశాలల్లో గణిత ల్యాబ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరారు.