calender_icon.png 17 May, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

17-05-2025 06:04:57 PM

గజ్వేల్: అనారోగ్యంతో బాధపడేవారు, ప్రమాదానికి కూడా చికిత్స పొందేవారు సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి(BRS Gajwel constituency incharge Vanteru Pratap Reddy) అన్నారు.  శనివారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 47 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయనిధిని ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వంలో లక్షలాదిమందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకోవడం జరిగిందని  తెలిపారు.

ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స కోసం ప్రజలు బయట నుండి అప్పులు చేసి వైద్యాన్ని పొందుతున్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరులో కూడా కోతలను విధించడం,  తక్కువ డబ్బులను మంజూరు  చేయడం బాధాకరమన్నారు. గజ్వేల్ కు చెందిన గుంటుకు బాలకృష్ణ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు దాదాపు రూ.47 లక్షల వరకు ఖర్చు పెట్టారని, రూ. 47 లక్షల బిల్లును సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేస్తే  రూ. 60 వేల రూపాయలను  ప్రభుత్వం మంజూరు చేయడం చాలా దారుణమన్నారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను పెంచి సిఎంఆర్ఎఫ్ దరఖాస్తు పెట్టుకున్న వారికి గరిష్ట మొత్తం  మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, వర్గల్ ఎంపీపీ లతా రమేష్ గౌడ్, కౌన్సిలర్లు  ఉప్పల మెట్టయ్య, మరికంటి కనకయ్య, గుంటుకు రాజు, రహీం,, హైదర్ పటేల్, ఉపేందర్ రెడ్డి, కిరణ్ గౌడ్, ఉమర్, అహ్మద్, అబ్దుల్, రాజు, కరీం లబ్ధిదారులు తదితరులున్నారు.