17-05-2025 05:59:15 PM
సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ నంది కామన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా కొలునూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్ డ్రైవర్ పరారీలో ఉనట్టు సమాచారం, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.