17-05-2025 06:34:59 PM
60వ రోజు ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ..
కల్లూరు (విజయక్రాంతి): సత్తుపల్లి ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు-పుష్పలత దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాధికారి నవ్య కాంత్ ఆధ్వర్యంలో శనివారం రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసినారు. కల్లూరు లైన్స్ క్లబ్ సెక్రటరీగా ఎన్నికైన కిన్నెర ఆనందరావు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం హర్షనీయమని డాక్టర్ నవ్య కాంత్ అన్నారు.
లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ చలువాది నగేష్ కుమార్ మాట్లాడుతూ... సేవా రంగంలో ముందున్న ఆర్టీసీ ఆనంద్ సేవలు అభినందనీయమన్నారు. అనంతరం వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కల్పించాలి అని ఆర్టీసీ సిబ్బందికి, ప్రయాణికులకు కల్లూరు బస్టాండులో 60వ రోజు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల లయన్స్ క్లబ్ ట్రెజరర్ దారా శ్రీను, మాజీ అధ్యక్షులు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.