calender_icon.png 17 May, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

17-05-2025 06:11:23 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): మద్నూర్ మండలంలోని రాచూర్ గ్రామానికి జాతీయ రహదారి కందర్ పల్లి నుండి రాచూర్ వరకు 3 కోట్ల రూపాయల అంచనా విలువతో బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kanta Rao) శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పేద పేల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తానని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు.