calender_icon.png 17 May, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

17-05-2025 06:16:16 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): బిచ్కుంద మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kanta Rao) శనివారం నాడు శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ధృడ సంకల్పంతో పని చేస్తుందని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం తాను ఎప్పుడూ కృషి చేస్తానన్నారు.