17-05-2025 05:52:27 PM
కంగ్టి: కంగ్టి పోలీస్ స్టేషన్(Kangti Police Station) సబ్ ఇన్స్పెక్టర్ గా దుర్గారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. సంగారెడ్డి నుండి బదిలీపై కంగ్టి వచ్చారు. ఇక్కడ పనిచేసిన విజయ్ కుమార్ సంగారెడ్డి సిఐడి శాఖకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసంఘిక కార్యక్రమాలు జూదం, అక్రమ మద్యం, గుట్కా తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీస్ సిబ్బంది నూతన ఎస్ఐ కి శుభాకాంక్షలు తెలిపారు.