calender_icon.png 17 May, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

17-05-2025 05:48:08 PM

మునగాల: వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ వాస్తవ్యులు జల్లా నాగేశ్వరరావు హేమలత వివాహ వార్షికోత్సవం సందర్భంగా ముకుందాపురం గ్రామంలోని ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో మధ్యాహ్న అన్న ప్రసాద వితరణ(రుచి ఫ్యామిలీ రెస్టారెంట్) సహకారంతో జరిగింది. ఈ సందర్బంగా వాసవి క్లబ్ అధ్యక్షులు యస్ యస్ రావు మాట్లాడుతూ.. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు సేకు శ్రీనివాస రావు, సెక్రెటరీ పత్తి నరేందర్, కోశాధికారి వెంపటి ప్రసాద్, డిస్టిక్ ఇంచార్జ్ చల్లా లక్ష్మీ నరసయ్య, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఇమ్మడి సతీష్ బాబు, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, అనాధాశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.