దుబ్బపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయక్రాంతి): గణపురం మండలంలోని దుబ్బపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాలనీ పనులు, జెన్ కో ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, విద్యుత్ పనులు, కన్వేయర్ బెల్ట్ నిర్మాణంపై సమీక్షించారు. పనులు గడువులోగా పూర్తి చేయాలని, టెండర్లు, అంచనాల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
అర్హులైన నిర్వాసితులకు పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ వినతులు త్వరగా పరిష్కరించాలని తెలిపారు. భూసేకరణలో నిబంధనలు పాటిస్తూ మిగిలిన సమస్యలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పీఆర్ ఈఈ విద్యాసాగర్, ఆర్డిఓ హరికృష్ణ, తహసీల్దార్లు లక్ష్మి రాజయ్య, రాజేశ్వర రావు, ఏఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.






