జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
- ఎస్‌ఐ వెంకట్రాజం
- వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జయంతి వేడుకలు
వేములవాడ,(విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్‌ఐ వెంకట్రాజం పోలీసు సిబ్బందితో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకట్రాజం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, త్యాగాలు నేటి యువతకు ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.






