07-01-2026 05:52:35 PM
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రగుడు జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రానున్న శివరాత్రిలోగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రూ.3 కోట్ల పది లక్షలతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ అభివృద్ధి పనులు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. జంక్షన్ సుందరీకరణ, గ్రీనరీ, డివైడర్ల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్ల పనులు కొనసాగిస్తున్నారు. ఆయా పనులను ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, రానున్న శివరాత్రి వేడుకలకు సిద్దం చేసి అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పరిశీలనలో మున్సిపల్ డీవైఈఈ వాణి, ఏఈ అధికారులు, సిబ్బంది ఉన్నారు.