07-01-2026 05:55:25 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108 మరియు 102 అంబులెన్స్ సేవలను రాష్ట్ర స్థాయి హెచ్‌ఆర్ హెడ్ శ్రీ కిరణ్ కిషోర్, శ్రీ రవీంద్ర పరిశీలించారు. బుధవారం నిర్మల్ లో తనిఖీలో తనిఖీలు నిర్వహించారు. నిరప్రోగ్రాం మేనేజర్ శ్రీ ఎన్. జనార్ధన్, ఈఎంఈ శ్రీ లింగాచారి ద్వారా సేవలు అడిగి తెలుసుకున్నారు.
అంబులెన్స్ కార్యకలాపాలు, సిబ్బంది పనితీరు, ప్రీ-హాస్పిటల్ కేర్ సేవల అమలును వారు సమీక్షించారు. అందిస్తున్న సేవల పట్ల శ్రీ కిరణ్ కిషోర్ గారు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇంకా ఎక్కువ మందికి వేగంగా సేవలు అందేలా ట్రిప్స్ సంఖ్యను పెంచాలని, ప్రీ-హాస్పిటల్ కేర్‌ను మరింత మెరుగుపర్చాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో లబ్ధిదారులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు.